home about create a tribute online tributes the blog articles contact log in

A Tribute to KavirviswoMahaaTejaa Gunturu Seshendra Sh

KavirviswoMahaaTejaa Gunturu Seshendra Sh
Saatyaki S/o Seshendra Sharma, KavirviswoMahaaTejaa's Please make a select
Enter Number 
10/20/1927
5/30/2007
79
98
No description has been entered for KavirviswoMahaaTejaa Gunturu Seshendra Sh's Warm Tribute Online Memorial yet.
There are currently no announcements for KavirviswoMahaaTejaa Gunturu Seshendra Sh's Warm Tribute Online Memorial yet.
View All: 2 Memories | 2 Notes

గుంటూరు శేషేంద్ర శర్మను మళ్ళీ తెల

A Note to KavirviswoMahaaTejaa by Saatyaki S/o Seshendra Sharma posted on Thu, 9/10/26, 1:10 AM

 

గుంటూరు శేషేంద్ర శర్మను

మళ్ళీ తెలుసుకుందాం

మే 30, 2010

 శేషేంద్ర మూడవ వర్ధంతి స్మారకోపన్యాసం

%7B6C0278EC-4D56-4581-AEAF-F15CAAAD139C%7D.tmpk1.jpeg- డా. కాత్యాయనీ విద్మహే

https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B9%E0%B1%87

 

 

గయలో గాశి ప్రయాగ శ్రీగిరిని గంగాద్వార నీలాచలో

 జ్జయినీ ద్వారకలందయోధ్య మధురన్ సంస్తుత్య పుణ్యస్థలా

గ్రియతన్ వెండియు మించు నైమిశ కురుక్షేత్రాదులం దర్పణ

 క్రియచే నా పితనమ్ముఁడెఱ్ఱన యొనర్చెన్ దండ్రికాహ్లాదమున్.

* * *

ఏనుంబితృపూజన నా

చే నైనట్లెద్దిఁయైనఁ జేయఁగవలయున్

 గానఁ, గృతి యిచ్చిమేదిని

పై నిలుపుదు నతని కీర్తి Cబరమేశుకృపన్||

(ప్రభావతీప్రద్యుమ్నం, పద్యాలు 8,9)

 

 

అని నిశ్చయించుకొని సూరన తన రచనను తండ్రికి అంకితమిచ్చాడు. పితృపూజ తర్పణ క్రియారూపమే కానక్కరలేదు అన్న సూరన మార్గంలో సాత్యకి గారు ఎంచుకొన్న పితృపూజనమార్గం తండ్రి గారయిన గుంటూరు శేషేంద్ర శర్మగారి వర్థంతిని సాహిత్యసభగా నిర్వహించటం. నాకూ సాత్యకి గారికి సమానధర్మం అది. 1990లో మానాన్న కేతవరపు రామకోటిశాస్త్రి మరణించినప్పటి నుండి ప్రతియేడూ అక్టోబరు 28 ఆయన రచననొకదానిని అచ్చువేయటం, పుస్తక పరిచయ సభగా సంస్మరణ జరపటం నేను చేస్తున్నపని. అలాంటిపనే తన తండ్రిగారిపట్ల నిర్వహిస్తున్న సాత్యకి గారు ఈసారి సభలో శేషేంద్ర శర్మగారి గురించి మాట్లాడమని నన్నడిగితే ఒప్పుకొన్న ప్రథమకారణం అదే. రెండవ కారణం మా నాన్నా శేషేంద్రశర్మ గారూ మిత్రులు కావటం, మూడవ కారణం ఒక సాహిత్య విద్యార్థిగా శేషేంద్రశర్మ గారిని మొత్తంగా ఒకసారి చదవటానికి తెలుసు కోవటానికి అవకాశంగా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొనాలనుకొనటం. ఆరకంగా సాత్యకిగారు, నేనూ ఒక సాహిత్య సంప్రదాయ వారసత్వంగా పింగళిసూరన మార్గంలో మాకు తెలియకుండానే ప్రారంభించిన నడకకు మామా తండ్రుల స్నేహవారసత్వం కూడా అదనపు విలువగా సమకూరిందనిభావిస్తున్నాను

నేను శేషేంద్రగారిని బి.ఎ. చదువుతున్నప్పుడు మొదటి సారి తెలుసుకొన్నాను. మాకప్పుడు ద్వితీయభాష తెలుగులో వచనసాహిత్య విభాగంలో శేషేంద్రశర్మగారి 'సాహిత్యకౌముది' పాఠ్యాంశం. శ్రీనాధుని పద్యశిల్ప సౌందర్యాన్ని నిరూపిస్తూ పద్యాలకు పద్యాలు ఉటంకిస్తూ శేషేంద్రగారు వ్రాసిన వ్యాసం ఆశ్చర్యకరంగా, ఆకర్షక కేంద్రంగా వుండింది. వ్యాసానికి వ్యాసం మాకప్పుడు ధారణలో వుండేది. నా బి.ఎ పూర్తయ్యేటప్పటికి మండే సూర్యుడు (1974) నాదేశం- నాప్రజలు కావ్యాలు వ్రాసి సాహిత్యరంగంలో గొప్ప చర్చకు కారణమైనాడు ఆయన. 1977లో ఎమ్మే అయిపోయాక కానీ నాకవి చదివే అవకాశంరాలేదు. నేను ప్రధానంగా వచనరచనా పాఠకురాలిని, శేషేంద్రగారు వ్రాసిన 'కామోత్సవ్' నవలను మాత్రం ఆంధ్రజ్యోతిలో సీరియల్గా వస్తుండగానే ఆసక్తిగా చదివాను. ఈ వస్తువేమిటి? ఇలా వ్రాసారేమిటి? ఇందువల్ల ఆశించిన ప్రయోజనమేమిటి? అని కొంత ఆందోళన పడ్డమాట వాస్తవం. సాత్యకి గారే ఎక్కడో నవల శేషేంద్రగారు వ్రాసింది కాదని మరెవరిచేతనో వ్రాయించి శేషేంద్ర పేరున అచ్చేసిన నవల అని చెప్పారు. అలా ఎందుకు జరిగిందో మనకు తెలియదు. అయితే శేషేంద్ర మాత్రం ఆ నవల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిన సందర్భంలో కూడా అది తనది కాదనలేదు. పైగా అన్ని నీతులు, అన్ని చట్టాలు సాధారణ ప్రజలకేగాని ఉన్నతవర్గాలకి వర్తించవు. ఉన్నత వర్గాల్లో వున్న అస్తవ్యస్త సంబంధాలు, సాంఘిక, నైతిక బాధ్యత లేవీ ఆవర్గానికి లేకపోవటం, ఆవర్గాలే పాలకవర్గంగా వుండటం మొదలైన అంశాలను చిత్రించే ఏ ఉద్దేశంతో తానా నవల వ్రాశాడో దానిని తెలుగు సాహిత్య పాఠకులు అర్థం చేసుకోలేకపోయారని వాపోయారు. (సాహిత్యదర్శిని. పు 239) రచయిత చెప్పిన ఈ ఉద్దేశాన్ని ఆ రచన ఎంతవరకు ఆవిష్కరించగలిగిందో ఇప్పుడు మళ్ళీ ఆనవల చదివితే కానీ నిర్ధారించలేము. అదలా వుంచుదాం.

శేషేంద్ర శర్మను సాహిత్య ప్రపంచంలో స్థిరీకరించినవి ప్రధానంగా ఆయన కవిత్వం, విమర్శ. అయినా ఆయన వ్రాసిన కథలు, ఒకే ఒక నాటకం కూడా మనం ప్రస్తావించుకొనవలసినవే. కథలు ‘విహ్వల' అన్న సంపుటిగా 1968లో వచ్చింది. ఆ సంవత్సరమే 'మబ్బుల్లో దర్బార్' అనే నాటకం కూడా అచ్చయింది. 'విహ్వలతో కలుపుకొని శేషేంద్ర వ్రాసిన కథలు ఐదు. ఇతివృత్తాలు వేరైనా కధలన్నిటి అంతస్సూత్రం జీవితవిషాదం. చిన్న చిన్న సరదాలను సంతోషాలను కూడా పొందటానికి అవరోధమయ్యే పేదరికం, పేదరికంలోనైనా పెన్నిధి వలె వుండే కౌటుంబిక బాంధవ్యాలను సైతం దక్కనీయకుండా ఆత్మీయులను ప్రమాదపు అంచులకు నెట్టివేసే వృత్తి జీవన విధానాలు, యుద్ధాలు, ఇవన్నీ జీవితంలో దుఃఖానికి ఎలా కారణమవుతున్నాయో చెప్పే కథలు విహ్వల, రంగుల చేప, ఎగిరిపోయిన హంస. వీటిలో విహ్వల కథ పిల్లల మనస్తత్వంలోని స్వచ్ఛతను నిబిడ బంధంతో చిత్రించింది. ఆర్థిక అసమానతలకు అతీతంగా వికసించగల మానవీయ సంస్పందనను ఆవిష్కరించింది. స్త్రీల జీవితాన్ని దుఃఖ భాజనం చేసే పురుష పశు ప్రవృత్తి హరిణ కథాంశమైంది. వయో తార తమ్యాలతో నిమిత్తం లేకుండా జనించే ప్రేమకాలాంతరంలో జీవిత వాస్తవాలను కంటి ముందు నిలబెట్టినప్పుడు కల్లోలానికి లోనయ్యే అంతరంగాలను ఆవిష్కరించింది హిరణ్మయి కథ. మొత్తానికి శేషేంద్ర కథలు చదివించే లక్షణం కలవి. మనో వైచిత్రీ చిత్రణ ప్రధానమైనవి.

'మబ్బుల్లో దర్బారు' 1954లో వ్రాయబడి ఆంధ్రప్రభలో ||అచ్చయి 1968లో ప్రథమ ముద్రణ పొందిన నాటకం. అయినా ఆనాటకంలో చర్చించబడిన సమస్యలు ఇంకా  అపరిష్కృతంగానే ////సంకు అధికారకాంక్షకు అది ఒక వ్యాఖ్యానంగా, విమర్శగా వుండటం వలన ఈనాటి సమాజానికి, స్వార్థపూరిత మానవమనస్తత్వానికి, కనబడుతుంది. భూమండల ఆక్రమణతో తృప్తిపడని మానవ మహాచక్రవర్తుల దురాశకు, దురహంకారానికి అధికార దర్పానికి శాస్త్రాలు, ప్రజాస్వామ్యం, కవులు-పురోహిత వర్గం, రాజకీయాలు దాసోహమైన ఒక దుఃస్థితిని దాని దుష్పరిణామాలను వస్తువుగా చేసి వ్రాసిన నాటకం ఇది. మానవుడి దురాశ కారణంగా విధ్వంసానికి గురవుతున్న పంచభూతాలు . అంటే ప్రకృతి పర్యావరణ హింసను తట్టుకోలేక మానవుడ్ని అంత మొందించాలనుకొని కూడా మానవుల్లోని మారే లక్షణం మీద ఒక ఆరిపోని ఆశతో - బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలనుకొనటంతో, అందుకొరకై చర్చలకు అతనిని పిలవనంపటానికి 'వేదాంతి'ని రాయబారిగా పంపటంతో ఈ నాటకం ప్రారంభమవుతుంది. వేదాంతి అంటే లౌకిక జీవిత మోహాలు, వ్యామోహాలు లేనివాడు. వేదాంతిని రాజ్యాధికారం పక్షాన నిలబడిన శాస్త్రజ్ఞుడికి తమ్ముడుగా చేసి శేషేంద్ర ఈ నాటకంలో రక్త సంబంధాల కన్న వర్గసంబంధాలు, ప్రయోజనాల ప్రాధాన్యతలు మానవ సంబంధాలలో ఎంత బలీయంగా పనిచేస్తున్నాయో సూచించారు. ప్రజాస్వామ్యం కూడా ఈ నాటకంలో ఒక పాత్ర. రాజ్యంచేత, అధికార వర్గం చేత అది ఎప్పుడూ తిరస్కరించబడుతూనే వుంటుంది. తేలికపరచబడుతూనే వుంటుంది. అధికార వర్గ ప్రయోజనాలకు, నా అనే స్వార్థాన్ని సమర్థించి సంరక్షించటానికి ఏర్పడిన చట్టాలకు వాటి నగ్నత్వం, క్రూరత్వం ప్రజలకు కనబడకుండా చేసే ఒక రక్షణ కవచంగా మాత్రమే అది ఉపయోగపడుతున్న స్థితిని శేషేంద్ర గుర్తించి ఈ నాటకేతి వృత్తంలో భాగం చేశారు. ప్రజాస్వామ్యం అద్దాల బీరువాలో వుంచబడిన సువర్ణాక్షరాల బైండు పుస్తకం అని చెప్పిన శేషేంద్ర దేశీయ ప్రజాస్వామ్యం నోరులేని, నోరు మూసుకొని పడి వుండాల్సిన జీవి స్థాయికి దిగి జార్చబడటాన్ని ఈ నాటకం స్పష్టం చేసింది.

స్వాతంత్య్రం ఒక మేడిపండు అని తెలిసి దానిని సాంస్కృతిక రంగంలో తీవ్ర స్వరంతో నిరసిస్తున్న దిగంబర కవిత్వోద్యమానికి, రాజకీయార్థికరంగంలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరిస్తున్న నక్సల్బరి విప్లవోద్యమానికి వేగుచుక్కగా వచ్చిన నాటకంగా మబ్బుల్లో దర్బారుకు ఒక ప్రాధాన్యత వుంది. కవులు ప్రభుత్వాధికారుల పక్షాన చేరి వారి సన్మానాలకు అశపడుతూ వారిని ఇంద్రులుగా చంద్రులుగా పొగుడుతూ పబ్బం గడుపుకొంటున్న తీరును గురించిన శేషేంద్ర ఆగ్రహం కూడా ఈ నాటకంలో భాగమైంది. ఇక్కడే తరువాతి కాలంలో శేషేంద్ర బలంగా నమ్మి ప్రచారం చేసి వైజ్ఞానిక నాయకత్వం భావనకు ప్రాతిపదికలు వున్నాయి. వేదాంతి చేత మానవమహాచక్రవర్తికి 'కవులూ, కళాకారులేరా నీకు వెలుగుబాటులు; నీ పురోగమనానికి నిదర్శనాలు'-అన్నమాటలు గమనించదగినవి.

1927లో పుట్టిన శేషేంద్ర శర్మ తన ఇరవయ్యవ ఏళ్ళ వయసునాటికే కవిత్వం ప్రౌఢంగా చెప్పటాన్ని బాగా అభ్యాసం చేశారు. 1947 నుండి అప్పుడప్పుడు చెప్పిన పద్యాల కూర్పుగా 1961లో చంపూవినోదిని వెలువడటంతో శేషేంద్ర కవిగా తెలుగు సాహిత్యరంగ ప్రవేశం చేశారు. 1962లో 'ఋతుఘోష' కావ్యప్రచురణ చేసి కవిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నారు. అక్కడి నుండి ఆయన కవితాజైత్రయాత్ర సందడిగా సంవాదాలతో సంరంభంగా సాగింది. 'యుగద్రష్ట'గా ఆయనకొక పేరు తెచ్చిపెట్టింది. కవిగా శేషేంద్రను రెండుకోణాల నుండి చూడాలి. ప్రాథమికంగా కవిత్వమంటే శేషేంద్ర దృష్టిలో ఆశ్చర్యం కలిగించే చమత్కార అభివ్యక్తి. వాల్మీకి తదితరుల కవిత్వ విశేష గుణగణ గానం చేసేటప్పుడు కూడా శేషేంద్రం తరచూ దీనికే ప్రాధాన్యమిచ్చారు. అందువల్ల తను కూడా అహా అనిపించేలా కవిత్వం వ్రాయటం పైననే దృష్టి పెట్టిన కవి శేషేంద్ర. 'గజల్' ప్రక్రియ శేషేంద్రకు ఇష్టం కావటం కూడా ఈ జీవలక్షణం వల్లనే. కనుక శేషేంద్ర కవిత్వాన్ని అభివ్యక్తి రామణీయత దృష్ట్యా పరిశీలించటం, ఆహా పుట్టించేట్లు కవిత్వం చెప్పటానికి ఆయన ఉపయోగించుకొన్న సాహిత్య మూలకాలను గుర్తించటం ఒక పద్ధతి. సౌందర్యం, చమత్కారం చూపించటానికి కవి కృషి చెయ్యాలన్నది శేషేంద్ర పిలుపు. అయితే అలా చెప్పటానికి ఏదో ఒక భావం అవసరం అని శేషేంద్రకు తెలుసు. శేషేంద్ర ఏ భావాలను తన కవిత్వంలో పలికించాడో పరిశీలించటం మరొక కోణం. ఆనుషంగికంగానే అయినా కవి ఏ సామాజిక సంవేదనను ఏ మేరకు తన కవిత్వంలో ప్రతి ఫలించాడో పరిశీలించాలి.

కవిత్వరచనాభ్యాసకాలంలో శేషేంద్ర ప్రతి జీవిత సందర్భాన్ని కవితా వస్తువు చేసుకొన్నారు. అప్పుడప్పుడు చెప్పిన విడివిడి పద్యాలను అలాగే అచ్చు వేస్తే చాటువులు. వాటికి సందర్భాన్ని హాస్య వ్యంగ్య చమత్కార పద్ధతిలో వచనంలో ఇస్తూ వ్యాఖ్యానిస్తూ కూర్చారు కనుక 'చంపూ వినోదిని' అయింది ఆపుస్తకం. తాను వినోదంగా వ్రాశారు. చదివేవారికి వినోదం కలిగించటం ఉద్దేశించారు. ఇందులో స్త్రీలను ఉద్దేశించి స్త్రీలను వర్ణిస్తూ వ్రాసిన శృంగార ప్రధాన పద్యాలూ వున్నాయి. కాఫీ హొటలు పరిసరాలను వర్ణించే పద్యాలూ వున్నాయి. ఆశువుగా చెప్పిన సరదా పద్యాలున్నాయి. అధికార దుర్మదాంధులను విమర్శిస్తూ వ్రాసిన తిట్టూ కవిత్వమూ వుంది. చూడండి.

లక్షాతొంబయి కుంభకోణములు నిర్లక్ష్యంబుగా సల్పుచున్.

 

 

కుక్షిన్ నింపెడు కుంభకర్ణులును భూగోళంబు గోళంబుగా

 

 

భక్షింపంగల బ్రహ్మ రాక్షసులు శుంభద్గండ భేరుండముల్

 

 

పక్షీంద్రుల్ తమ జీర్ణ శక్తి కివిగో బాబూ నమస్కారముల్....

 

 

                * * * *

ఓరోరీ! అధికార దుర్మద వితండోద్ధండ చండాలుడా

 

 

నీరాజత్వము నీనిరంకుశ దశన్ నీ గర్వ సర్వస్వమున్

 

 

 నీరేఖాలవమేని నిల్పక నినున్ నిర్మూలముంజేసి ని

 

 

స్సారుంజేయు దినంబు వచ్చె నికపై చాలింపు నీవేషముల్.

 

 

ఆఫీసర్లదీ రాజకీయ నాయకులదీ ఒకే లక్షణం, ఒకే తత్త్వం, ఒకే దృక్పథమూ అని 1954 నాటికే స్పష్టంగా తెలుసు శేషేంద్రకు. ధనిక వర్గం వాళ్ళకు వెన్నెముకగా వుందని కూడా తెలుసు. వాళ్ళమీద తన ధర్మాగ్రహాన్ని కవి వ్యక్తం చేశారు కవిత్వం మాధ్యమంగా.

అప్రయోజకులైన యీ ప్రజానీకంబు

 

 

ఘనతర క్షీరసాగరము గాగ

 

 

 ఎల్లదిక్కుల తాండవించు నజ్ఞానంబు

 

 

బలమైన మందరాచలముగాగ

 

 

 జాజ్జ్వల్వమాన ప్రజాస్వామ్య సూత్రంబు

 

 

త్రాడైన భుజగాధిరాజు గాగ

 

 

మహిత కోపాటోప మదమత్సరంబులు

 

 

 గగనమంటెడు తరంగములుగాగ

 

 

చటుల కలికాల రాక్షసజాతులైన

 

 

 రాజకీయులునుద్యోగు లాజివోలె

 

 

 ఉభయ పార్శంబులంజేరి యుగ్రధాటి

 

 

చిలుకు చున్నారలధికార సిద్ధి కొరకు -”

 

 

ఇలాంటి సామాజిక విమర్శనాత్మక పద్యాలు చంపూ వినోదినిలో వున్నాయి. ఇది చెప్పట మెందుకంటే శేషేంద్ర ప్రారంభ కవిత్వం సంప్రదాయ ప్రాబంధిక పద్య నిర్మాణ వారసత్వం నుండి రూపు తీసుకొన్నదనీ, విషయం, భాష రెండూ ఇందులో ప్రధానంగా వున్నాయని చెప్పటానికి. ఋతుఘోష దానికి కొనసాగింపు. పద్య రచన శ్రీనాథాధి పూర్వ కవుల ప్రభావంతో సాగటం, ఉత్పల సత్యనారాయణచార్యులు గారన్నట్లు పదాలతో పాఠకులను మోహింప చేయటం, ఇందులో ప్రధానం. విశ్వనాథసత్యనారాయణ గారు గుర్తించి చెప్పిన విశేషం - ఋతువులలో బాహ్యవిలాసం, మానవ మనోప్రవృత్తుల మీద వాటి ప్రభావం, మానవుల సామాజికార్థిక వైయక్తిక పరిస్థితులలోని ప్రత్యేకత మూలంగా ఆ ప్రభావాలలోని వైవిధ్యం, విషాదం ఈ కావ్యంలో ప్రతి ఫలించటం -ఏది ఏమైనా భావుకత ఇందులో కేంద్రాంశం. భావకవిత్వాన్ని ముప్ఫైఏళ్ళ తరువాత పునరుజ్జీవింప చేసే పనికి పూనుకొని వ్రాసిన కావ్యంగా ఇది కనిపిస్తుంది.

చిక్కని చిగురాకు జీబులో పవళించి

యెండువేణువు కంఠమెత్తిపాడె తలిరాకులూడిచి తపసిగా మసలిన

నగ్నవల్లికయు పర్ణములదాగె జిలుగు సీతాకోకచిలుకరూపము దాల్చి కీటకయోగి కంకేళి గవిసె

శిశిర వ్రతాచార జీర్ణమారుతమూర్తి యలరు గిన్నెల గంధమలదు కొనియె

ఇచ్ఛ ప్రకృతిలో రెక్కవిచ్చెనేమొ యెడద పురుషునిలో మొగ్గదొడిగెనేమొ విశ్వమందిర కుడ్యముల్ విరుగగొట్టి మోహకల్లోల వీచిక ముంచివ

Yuga

A Memory of KavirviswoMahaaTejaa by Saatyaki S/o Seshendra Sharma posted on Thu, 9/10/26, 12:53 AM

 యుగానికొక్కడు !

గగనానికి సాటి గగనమే! సాగరానికి సాటి సాగరమే!

--------

గగనానికి సాటి గగనమే! సాగరానికి సాటి సాగ రమే! అన్నట్లు శేషేంద్రకు సాటి శేషేంద్రే! మరి యొకరు సరికారు. అతడొక యుగకవి! యుగద్రష్ట! అం దువల్ల అతని గురించి కానీ అతని సాహిత్యం గురించి కానీ, ముఖ్యంగా వారి ’కవిసేనఫెస్టో’ గురించికానీ మాట్లా డం ఒక సాహసమే అవుతుంది. ఇక శేషేంద్రను లోకానికి పరిచయం చేయడమన్నా అంతే! ఒక చిట్టి దీపం వెలుగు ల్లో సూర్యుని చూపినట్లూ, ఒక గజం బద్దతో సముద్రాన్ని కొలువ జూచినట్లా అవుతుందది.
అందువల్ల శేషేంద్ర మాటల్లోనే చెప్పాలంటే- ‘వేదం మొదటి కవిత్వం’ ‘ఉపనిషత్తులు వచన కవితలు. ఇతిహాస పురాణాదులు బుర్రకథల్లాంటి లోక ప్రియకవితలు’ ‘ప్రాచీ న కవిత్వం శోకంలోనుంచి వస్తే, ఆధునిక కవిత్వం క్రోధం లో నుంచి వస్తుంది’. ‘అక్షరాల ఇసుకతో కవిత కట్టలేరు. జీవన మధూళితో తడపాలి ‘కవి ఒక్కడే మానవ సమాజా నికి ఏకైక నాయకుడు’ అన్న వాక్యాలు మామూలు మాట లు కావు. ఏ దివ్యలోకాల్లోంచో దిగివచ్చిన తేజఃపుంజాల్లా కనిపిస్తాయే తప్ప, ఏ మానవ మాత్రుడో గండూషించిన పడికట్టు మాటల్లా ఉండవు.
ఇవి శేషేంద్ర ‘కవిసేన మేనిఫెస్టో’లోనివని ప్రత్యేకం గా చెప్పనక్కరలేదనుకుంటాను. అందుకే, ఇవి ఒక మహ ర్షి తన సమాధి స్థితిలో దర్శించుకొన్న దర్శనాల్లా ఉంటా యి. అత్యద్భుతంగా ఉంటాయి. సాహితీసాగర మథనం లోంచి ఉద్భవించిన అమృతకలశంలోంచి నాల్కపై జారి పడే మధుబిందువుల్లా ఉంటాయి. నిజమే! కవిసేన మేని ఫెస్టో మనపాలిటి అమృతకలశమే.
ఇలాంటి మాటలు ’కవిసేనమేనిఫెస్టో’లో కోకొల్లలు. కవిసేన నిర్మాతా ‘కవిసేన మేనిఫెస్టో’ని ఒక్కరే! అది కవీం ద్రులు శేషేంద్రులే! కాలక్రమంలో ‘కవిసేన’ చెల్లాచెదరై పోయింది. నిజానికిప్పుడు శేషేంద్ర అభిమానులంతా కవి సేన సభ్యులే! మబ్బుల్లో పిడుగుల్ని దాచుకొన్న వీరులే! అందువల్ల దానికి క్షతిలేదు; దినదినాభివృద్ధితప్ప. ఒక రామసేతువులా నేడు కవిసేన మేనిఫెస్టో నిలిచిపోయింది, సరిహద్దుల్ని చెరిపేస్తూ! కాలానికి ఎదురీదుతూ!….. ‘నైష ధం’ వలె నేటి కవి పండితులకిది ఒక దివ్వౌషధం!
స్వయంగా కవే ప్రకటించినట్లు, ఇదొక వైజ్ఞానిక ఉద్య మం. ఒక ఆధునిక కావ్యశాస్త్రమే. ఇలా, ఒక కవియే కావ్యశాస్త్రం రచించడం అత్యంత విశేషం. దీంతో ఇతడు అమరుడై, కవిపండితుల తలల్లో, ఆలంకారికుల తలల్లో ఒక అలంకారమైపోయాడు. ఒక్క మాటలో ఇలాంటి పుస్తకం ‘న భూతో న భవిష్యతి’.
ఈ కావ్యశాస్త్రాన్ని చదవకుండా, కవితా రచనకి పూనుకోవడం ఒక దుస్సాహసమే అవుతుంది. ఇతి 1977 ఆగష్టులో ప్రథమ ముద్రణకు నోచుకొంది. ఆపై హిందీ లోకి, ఆంగ్లంలోకి అనువదించబడి ప్రపంచవ్యాప్తమై పోయింది.
ఇది ఒక కవి రాశిన ఆధునిక కావ్యశాస్త్రమనీ, ఇది అపూర్వ చైతన్య వ్యాప్తికోసం ఐతిహాసిక పరిస్థితుల్లో ఆవి ర్భవించిందనీ, ఇది ప్రాచీన ప్రాక్‌, పశ్చిమ కావ్యతత్త్వ చింతన, ఆధునిక కావ్య తత్త్వచింతన, మార్క్పిస్టు కావ్య తత్త్వ చింతన అనే చింతనా చతుష్టయ శాఖల్ని కలిపి పరిశీ లించి, వాటిల్లోని అభిన్నతనూ, ఐకమత్యాన్నీ ప్రతిపాది స్తుందనీ ఈ పుస్తకం అట్టచివర (‘వైజ్ఞానిక ఉద్యమం కవిసేన’) ప్రకటించారు.
ఏదికవిత్వమో, ఏదికాదో విడమరచి చెబుతూ, ప్రతిభా, వ్యుత్పన్నతా, శిల్పం, సాహిత్య సాంఘిక స్పృ హలూ, సాహిత్య ప్రయోజనం, కమిట్మెంటూ, కవిబాధ్యత మొదలైన అనేకానేక విషయాలను కూలంకషంగా చర్చిం చి, నిగ్గుదేల్చుతుందిది. ఒక్కమాటలో చమత్కారమే కవిత్వ మని తేల్చిచెబుతుందిది.
ఈయన భారతీయ ఋషుల్నీ ప్రాక్‌, పశ్చిమ తత్త్వ వేత్తల్నీ, ఆలంకారికుల్నీ కలిపి, ఒకేవేదికపై కూర్చోబెడ తాడు. వాళ్ళని వాగ్వివాదంలోకి దింపుతాడు. తాను మహేంద్రునిలా సాహిత్య వజ్రాయుధపాణియై వాళ్ళ ఆలోచనల సారమైన సోమరసాన్ని దోసిళ్ళతో గ్రోలుతాడు. మనకీ వడ్డిస్తాడు. అవును అంతటి ఘటికుడీతడు. కవిత్వా నికి వీరిచ్చిన అపూర్వమైన నిర్వచనాన్ని చూడండి! ‘తక్షణ మరణాన్ని, పునర్జన్మనీ ‘ప్రసాదించేదే కవిత్వం’!
ఇలాంటి ఆలోచనాత్మకమైన, శక్తివంతమైన నిర్వ చనం మరోచోట మనకెక్కడా కనిపించదు; పుస్తకాల గుట్ట ల్లో తలముంచితీసినా!. కవిత్వనామక కళోపాసనలో ఋషి కవి. దేవత జగత్తు. బీజము బాధ, శక్తి రసము, కీలకం వైచిత్రి. వినియోగం విశ్వశ్రేయస్సు అన్న విశ్లేషణకూడా! దీంతో కవిత్వాన్ని వేదమంత్రాల ప్రక్కన, ఉన్నతాసనంపై కూర్చోబెట్టడమయింది. అంతేకాదు. కవితారచనా ప్రక్రి య ఒక పవిత్ర యజ్ఞసమమైపోయింది.
అందుకేనేమో- ‘పద్యం ఒక దేవాలయం! అందులోకి ప్రవేశించాలంటే శబ్దాలూ, భావాలూ, చివరకు దేవుడు కూడా, శుభ్రంగా స్నానంచేసి, మడికట్టుకొని ప్రవేశించాలి’ ఆనంటాడు. అనగా ఒక్క శరీరాన్నే కాదు, దశేంద్రియాల్నీ, అత్మనీ పరిశుభ్రపరచుకోవాలన్నది దీని అర్థం.
ఇక కవి గురించీ, కవిత్వం గురించీ వీరు చెప్పిన విష యాల్ని సంక్షిప్తంగా చెప్పాలంటే- ‘కవిత్వమంటే అర్థవై చిత్రి. భావవైచిత్రి. కవిత్వం ఒక జీవన విధానమేకానీ, బ్రతుకు తెరువుకాదు. కవి నడుస్తున్న వర్తమాన మనవతా సంక్షిప్త శబ్దచిత్రం. వర్తమాన కవులు కవిత్వపు కల్తీలేని స్వచ్ఛమైన వచనం రాస్తున్నారు’. అన్న వాక్యాల్ని ఉటం కించాల్సి వస్తుంది.
ఇంకాస్త వివరించాలంటే-
‘గత వెయ్యేళ్ళ తెలుగుకవిత్వం వాచ్యార్థ ప్రధానమైన ఛందోబద్ధ వచన యుగం, ‘ఇంగ్లీషులో సమస్త ఆధునిక కాలమూ ఉంది. సంస్కృతంలో సమస్త ప్రాచీన కాలమూ ఉంది. ఈ రెంటినీ కలిపి, దేశకాల అవిచ్ఛిన్న మానవ సర్వస్వాన్ని దర్శించుకోవాలి జ్ఞాని అయిన కవి.
కవికి ప్రతిభావ్యుత్పత్తులు కావాలి. కమిట్మెంటు కావాలి. అతడు జీవితమంతా ఒక తపస్సు చేయాలి. సమా ధి స్థితిలో దర్శించి లిఖించాలి అనంటాడు.
‘ప్రతిభ యనగా సర్వజీవరాసుల్లో ఉన్న చైతన్యమనీ
’వ్యుత్పత్తి’ యనగా ఛందస్సు, వ్యాకరణం, చతుష్షష్టి కళలు, లోకజ్ఞత, న్యాయవైశేషికాది పదార్థశాస్త్ర విజ్ఞా నమూ, వీటి మూలకణాంగా సిద్ధించిన యుక్తాయుక్త వివే కరూప ఔచిత్యస్పృహా ఇవన్నీ కలిసి వ్యుత్పత్తి అవుతుందనీ, ‘కమిట్మెంటు’ అంటే లోకం కోసం శోకం అనీ, అంటే’ అధర్మ వ్యతిరేకత యనీ ‘తపస్సు’ ఒక ఆత్మదండనమనీ అంటాడు.
ఆపై వర్గచైతన్యం సామాజిక చైతన్యం అభ్యుదయ దృక్పథం, ఆత్మాశ్రయ కవిత్వం. మొదలైన వాటి గురించి ప్రస్తావిస్తూ-
ధర్మాధర్మ పక్ష విచక్షణా జ్ఞానమే వర్గచైతన్యమనీ సామాజిక చైతన్యం కన్నా సాహిత్య చైతన్యం గొప్పదనీ, సాహిత్య స్పృహలేని వాడొక న్యూస్‌ పేపర్‌ బాయ్‌ అనీ సాహిత్య చైతన్యం ఒక విరాట్‌ స్వరూపమైతే, రాజకీయ చైతన్యం దాని వెంట్రుక ముక్కనీ, శ్రమించే రంగాల్లో, రమించే రంగాల్లో సర్వతా స్త్రీపురుషులు సమానంగా స్థానం పంచుకోవాలన్నదే నిజమైన అభ్యుదయ సమాజం దృక్పథమనీ, పరాశ్రయాన్ని ఆత్మాశ్రయం చేసుకోవడంలో నుంచే కవిత పుడుతుందనీ, సబ్జెట్లో ఆబ్జెట్‌ లీనం కావడంలోనుంచే కవితపుడుతుందనీ, ఇదే ఆత్మ జగత్తులో, జగత్తు ఆత్మలో ఐక్యం కావడమనీ వివరిస్తాడు. భావాలన్నీ ఆత్మాశ్రయాలే కనక కవిత్వమంతా ఆత్మాశ్రయమేననీ, ఆత్మాశ్రయం కాకపోతే కవిత్వమే కాదు. కాబట్టి ఆత్మా శ్రయ కవిత్వమన్న మాట పునరుక్తి దోషభూయిష్టమనీ సెలవిస్తాడు.
ఇలాంటి అనేకానేక కావ్వ మర్మాల్ని అందించే మహాత్తర గ్రంథరాజమిది. వాటన్నిటినీ ఉటంకిస్తే ఇది మరియొక ఉద్గ్రంథమవుతుంది.
‘కవిసేన మేనిఫెస్టోపై వచ్చిన కొన్ని విమర్శలు.

  1. దీంట్లో చారిత్రక దృక్పథం లేదన్నాట్ట ఓ విర్శకుడు, ఐతే, ఇది చరిత్ర కాదుకదా? ఆపై కథకాదు, నవల కూడా కాదు. చివరకి కవిత్వమూ కాదు. అందువల్ల చారిత్రక దృక్పథం అక్కర్లేదు.
  2. ఇది ’కవిసేన’ కాదు – ’కపిసేన’ అన్నారట మరొకరు! ఇవన్నీ పడికట్టు మాటలే! నిజానికి ’కవిసేన’ శబ్దకల్పనకి మూలం లేదా ప్రేరణ రామాయణంలోని ’కపిసేన’ శబ్దమే కాదనలేం కానీ, ’కపి’యంటే కోతి. ఇది పై పొరలోని అర్థం. ఒక సామాన్యుడి అవగాహన ’కపి’ యంటే సూర్యుడు. ఇది లోపలిపొరలోని అర్థం. అందువల్ల ‘కవిసేన’ యనగా సూర్యుని సైన్యం. అనగా సూర్యకిర ణాలే! వాల్మీకి రామాయణంలోని ఈ సూర్యకిరణాలే (చీకటి వెలుగుల మధ్య) ఒక సేతువును నిర్మించాయి. రామయణం భారతాదులన్నీ ప్రతీకాత్మక కావ్యాలేకదా?… ఇలా శబ్దార్ధం, ప్రతీకాత్మకతా తెలియకుండా మాట్లాడితే మన అజ్ఞానమే బయలుపడుతుంది సుమా!
    ‘ఇది హైందవం. ఛాందనం విప్లవ ప్రతిఘాతకం’ అన్నది మరో విమర్శ. ఆ అన్నది కవియో, విమర్శకుడో, ఆస్తికుడో, నాస్తికుడో తెలీదు.
    ఈ కావ్యశాస్త్రం హైందవమెలా ఆపుతుంది? ఐనా అన్ని శాస్త్రాలకీ, కళలకీ మూలం మన హిందూ (సింధూ) దేశమేనన్నది మనం మరువకూడదు. ఐనా, శేషేంద్ర ఒక్క భారతీయ కార్యశాస్త్రాల్నే ఆధారం చేసుకొని వ్రాయలేదు కదా? మార్క్పిస్టు సాహిత్య శాస్త్రగ్రంథాలనీ, ప్రాచ్య, పాశ్చా త్య, కావ్యశాస్త్రాలలనీ శోధించి వ్రాశాడు. చివరి పుటల్లో ఇచ్చిన ’సంప్రదించిన గ్రంథాలజాబితా’ను వీరు బహుశా చూచి ఉండరు. చూస్తే అలా మాటాడి ఉండరు. ముక్తా యింపు: మనకు ’కవిసేనమేనిఫెస్టో’ని చదివే ఓపికా అర్థం చేసుకొనే ఓపికా, ఆచరించే ఔన్నత్యమూ లేవు. అందుకే మేకపోతు గాంభీర్యం’తో, అలా రాళ్ళని విసురుతూ పోతుంటాం!
    బురద చల్లుతూ పోతుంటాం! అంతే! రామాయణం భారత భాగవతాదులపై వేదాలపై రాళ్ళేసిన మహా మహులు దీని పై వేయరూ? మళ్లీ చెబుతున్నాను ఇలాంటి ఆధునిక కావ్యశాస్త్రం ‘నభూతో నభవిష్యతి’ శేషేంద్ర స్వ యంగా ఒక కవి. విమర్శకుడు. ఆపై పరిశోధకుడు. అంతే కాదు ఆధునిక కవిత్వానికి ఒక మార్గదర్శకుడు.
    అందువల్ల ఈర్ష్యాద్వేషాన్ని ప్రక్కనెట్టి ఈ పుస్తకం ద్వారా కావ్యమర్మాన్ని తెలుసుకుందాం! ఆచరిద్దాం! మన ల్ని మనం సరిదిద్దుకొందాం! ఒక నవ్య సాహిత్య జగత్తును నిర్మిద్దాం.

  3. గన్ను కృష్ణమూర్తి

  4. విద్వత్‌ కవి, సాహితీమూర్తులు

(30 శేషేంద్ర శర్మ 17వ వర్ధంతి )

-------------     

Seshendra Sharma
October 20th, 1927 - May 30th, 2007
http://seshendrasharma.weebly.com/
https://seshen.tributes.in/

https://www.facebook.com/GunturuSeshendraSharma/                                                                           

Sahasraabdi Daarsanika Kavi

A Memory of KavirviswoMahaaTejaa by Saatyaki S/o Seshendra Sharma posted on Thu, 9/10/26, 12:27 AM

పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వరాష్ట్రేంద్రుబిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు .సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచిలాడిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశంనాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచనరెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.

                                                                            యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
                                                                      .జో. – వి. భొ. ప్రచురణలు 1999 

--------------------

శేషేంద్ర శర్మ

(20-10-1927 - 30-5-2007)

సంస్మరణ

ప్రముఖ సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ (79) మే 30 రాత్రి మరణించారు. ఆయన 1927లో నెల్లూరులో తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ పనిచేశారు. 'నా దేశం నా (ప్రజలు' ‘శేషజ్యోత్స్న, ‘రక్తరేఖ', 'గొరిల్లా', 'ఆధునిక మహాభారతం', 'జనవంశం', “రుతుఘోషు', 'మండేసూర్యుడు', 'స్వర్ణహంస', 'రామాయణ రహస్యాలు' వంటి రచనలు చేశారు. 'కవిసేన మేనిఫెస్టో ఆయన సుప్రసిద్ధ రచన. ఆయన సాహిత్యకృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. కవిత్వం, సాహిత్య విమర్శ ఇతర వచన రచనలన్నీ కలిపి 40కి పైగా పుస్తకాలు వచ్చాయి.

ధన్జ్గరి సాహచర్యంతో రాణివాసానికి వెళ్ళి సాహిత్య సామ్రాట్గా మారినట్లు కనిపించినా, ఆయన చివరి దాకా ఎస్టాబ్లిష్మెంట్కు దూరంగానే ఉన్నారు. ఉద్యోగం తొలిరోజుల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్యోగ సంఘాన్ని ఐ.వి. సాంబశివరావుతో కలిసి నిర్మాణం చేసి కమ్యూనిస్టుగా ముద్రపడి ఆయనను నిర్బంధ పదవీ విరమణకు గురిచేసింది. 1955 ఆంధ్రా ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీవైపు నిలబడిన శ్రీశ్రీ దాదాపు మతిస్థిమితం కోల్పోయినప్పుడు ఆయనకు అండగా కవిత రాసి ఓటమి తాత్కాలికమే అని ప్రోత్సహించిన కవి శేషేంద్ర. ఇంక 1991 నుంచి గల్ఫ్ యుద్ధాన్ని ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యవాదాన్ని స్థిరంగా వ్యతిరేకించిన శేషేంద్ర 'నీతులు చెప్పే అమెరికా ఇదీ నీ చరిత అని వ్యాస సంపుటివెలువరించారు. ఆయన మరణానికి "వీక్షణం తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.

వీక్షణం

రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక

జూలై 2007

---------

 

సహస్రాబ్ది దార్శనిక కవి

కవిర్విశ్వో మహాతేజా

 

గుంటూరు శేషేంద్ర శర్మ

 

Visionary Poet of the Millennium

 

                                      http://seshendrasharma.weebly.com/

 

జననం

1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా

మరణం

2007 మే 30 (వయసు 79)హైదరాబాదు

తండ్రి 

 

సుబ్రహ్మణ్య శర్మ

తల్లి

 

అమ్మాయమ్మ

భార్య /

జానకి 

పిల్లలు

వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)


Dear KavirviswoMahaaTejaa

A Note to KavirviswoMahaaTejaa by Saatyaki S/o Seshendra Sharma posted on Thu, 9/10/26, 12:14 AM

సహస్రాబ్ది దార్శనిక కవి

కవిర్విశ్వో మహాతేజా

గుంటూరు శేషేంద్ర శర్మ

 

Visionary Poet of the Millennium

 

                                      http://seshendrasharma.weebly.com/

 

జననం

1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా

మరణం

2007 మే 30 (వయసు 79)హైదరాబాదు

తండ్రి 

 

సుబ్రహ్మణ్య శర్మ

తల్లి

 

అమ్మాయమ్మ

భార్య /

జానకి 

పిల్లలు

వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)


కవి  విమర్శకుడు 
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలుఅన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతుఅన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………...... గుంటూరు శేషేంద్ర శర్మ   కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు
                                                                                                          
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
                                                                                                                                     (21 ఆగస్టు, 2000)

ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు. 

 

-       పుస్తకం.నెట్  


* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వరాష్ట్రేంద్రుబిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు .సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచిలాడిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశంనాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
<